నేలకు హరివిల్లులు అద్దిన జిఎంసి సంక్రాంతి సంబరాల రంగ వల్లుల పోటీలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన రంగవల్లుల పోటీలు నేలకు హరివిల్లులను అద్దాయి.
ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను చాటేలా జిఎంసి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని, అందులో భాగంగా ఆదివారం మహిళామణులు పాల్గొన్న రంగవల్లుల పోటీలు, మెహంది అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయన్నారు. రంగవల్లుల పోటీల్లో 72 మంది పాల్గొన్నారని, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ బహుమతులు అందిస్తామన్నారు. సోమవారం నుండి జరిగే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయని, సంబరాలకు హాజరయ్యే ప్రజలు తెలుగు సంప్రదాయాన్ని చాటే వస్త్రధారణతో రావాలని కోరారు.
ఎంఎల్ఏ గల్లా మాధవి మాట్లాడుతూ జిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు గుంటూరు నగరానికి సాంప్రదాయకమైన సొబగులు తెచ్చాయన్నారు. రంగవల్లుల పోటీల్లో మహిళలు చాలా ఉత్సహంగా పాల్గొన్నారని, ఇదే ఉత్సాహంతో మరో 3 రోజులపాటు జరిగే సంబరాల్లో పాల్గొనాలని కోరారు. సంబరాల్లో సంక్రాంతికి తెలుగు ప్రజల జీవన విధానం, ఆట పాటలు, సంస్కృతిని నేటి తరానికి తెలిపేలా ఉంటాయన్నారు.
అనంతరం రంగవల్లుల పోటీల్లో జి.సురేఖ, పి.సుజాత, టి.భారతిలకు వరుసగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు, పోటీల్లో పాల్గొన్న 6వ తరగతి విద్యార్ధిని సుప్రతికి ప్రత్యేక బహుమతి, మరో 5 మందికి కన్సొలేషన్ బహుమతులను కమిషనర్, ఎంఎల్ఏ అందించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, సిటి ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, నిర్వహణ కమిటి సభ్యులు డి.శ్రీనివాసరావు, విజయలక్ష్మీ, కాశయ్య, నసీర్ అహ్మద్, లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *