గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్ధిక సహకార సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సూచనాలు మేరకు మహిళా ప్రాంగణం ఆవరణంలో నూతనంగా నిర్మించబడిన “సఖి నివాస్” (మహిళా ఉద్యోగినుల వసతి గృహము) ది.21.01.2025 న మంత్రి మరియు అధికారుల చే ప్రారంబించబడుచున్నది. కావున అడ్మిషన్స్ ప్రారంబించబడినవి. దేశములోని సామజిక, ఆర్థిక, ప్రగతి శీల మార్పుతో మహిళలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలనుండి ఉపాధినిమిత్తము సొంత గృహములను వదిలి పెట్టటము జరుగుచున్నది. అలాంటి మహిళలు ఎదుర్కోనే ఇబ్బందులు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సురక్షితమైన మరియు సౌకర్యవంతంగా ఉండే వసతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం “సఖి నివాస్” (మహిళా ఉద్యోగినుల వసతి గృహము) సౌకర్యాల పధకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీములో బాగంగా హాస్టల్ నందు రుచికరమైన భోజనం, బెడ్స్, ప్యాన్లు గల విశాలమైన డార్మిటరీ, తగినన్ని వాష్ రూమ్స్, టాయిలెట్స్, నీటి సౌకర్యం, పటిష్ట మైన రక్షణ వ్యవస్థ, ఇంటర్ నెట్, వైఫై సౌకర్యములతో, ఇతర హాస్టల్ కంటే తక్కువ ఫీజుతో ప్రవేశం కలదు. కావున మొదటగా వచ్చిన వారికి మొదటగా అడ్మిషన్స్ ఇవ్వడం జరుగును.
మరిన్ని వివరములకు సంప్రదించవలసిన చిరునామా:
జిల్లా మేనేజర్, సఖినివాస్, మహిళాప్రాంగణం, యన్.టి, ఆర్.సి, యస్, డి& ఈ, డబ్ల్యూ, కలెక్టర్ బంగ్ల ప్రక్కన, గుంటూరు, ఫోన్ 8333921344, 8333921371.