రాష్ర్ట ప్రజలందరికీ భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్యరాశులు ఇంటికి తరలివచ్చే వేళ జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని  మంత్రి అనగాని ఆశించారు. ప్రజలందరూ పుట్టిన ఊళ్లకు చేరుకొని బంధుమిత్రులతో కలిసిపోయి ఆనందంగా పండుగు జరపుకోవాలని మంత్రి అనగాని కోరుకున్నారు. గత ఐదేళ్లు సంక్రాంతి పండుగ కళ తప్పిందని. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోందని మంత్రి అనగాని వెల్లడించారు. ఇందుకు గత ఏడాది కంటే అధిక సంఖ్యలో సొంతూళ్లకు చేరుకుంటున్న వివిధ పట్టణాలకు చెందిన ప్రజలే నిదర్మనమన్న మంత్రి అనగాని అన్నారు. ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో వివిధ వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చేలా సీఎం చంద్రబాబు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిల నిధులు విడుదల చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తమ అధినేత చంద్రబాబు లక్ష్యమని, అందులో భాగంగానే పీ4 పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్  ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *