విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 6 నుంచి 8 తేది వరకు సింగపూర్లో జరిగిన 10వ ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్లో నగరానికి చెందిన పోరంకి సత్య ప్రసాద్ రాజు పలు విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ పొందడం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆదివారం ఉదయం 7వడివిజన్లో జర్నలిస్ట్ కాలనీకి చెందిన పోరంకి సత్యప్రసాద్రాజును తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ నిత్యం యోగ సాధన చేయడం ద్వారా శరీరం ఆరోగ్యంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పతకాలు కూడా సాధించవచ్చునని సత్య ప్రసాద్ రాజు నిరూపించారని చెప్పారు. సత్యప్రసాద్ రాజును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలన్నారు. సత్యప్రసాద్ రాజు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆకాంక్షించారు. సత్యప్రసాద్ రాజు మాట్లాడుతూ రోజూ యోగా చేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చునని చెప్పారు. ఈ పోటిల్లో మొత్తం 12 దేశాల నుంచి యోగసాధకులు హజరై తనకు గట్టి పోటిని ఇచ్చారని, వారందరిలో తాను ప్రతిభ చూపానని అన్నారు. అందరూ యోగా చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ పాల్గొని సత్యప్రసాద్రాజును అభినందినలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …