-సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలి
-గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి
-కోడి పందాలు, జూద , గుండాట లకు దూరంగా ఉండాలి
-జిల్లాలో జనవరి 13 భోగి పండుగ సంధర్భంగా పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ భారత దేశ ప్రాంతాలలో ప్రజలు, రైతులు జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి పండుగ అని , మీ మీ కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులతో సాంప్రదాయ బద్దంగా వేడుకల్లో పాల్గొని ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ చేశారు. ప్రతి ఇంటి సిరులు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వేదజల్లాలని అభిలాష వ్యక్తం చేస్తూ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియ చేశారు. కోడి పందాలు నిర్వహణ పై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జంతు హింసా చేయరాదని, జూదం , గుండాట వంటి క్రీడల్లో పాల్గొనరాదని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. భోగి పండుగ రోజున ప్రభుత్వ సెలవు కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి జిల్లా, డివిజన్ , మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం జనవరి 13 వ తేదీ నిర్వహించడం లేదని ఆ ప్రకటనలో వెల్లడించారు.