విజయవాడ సంప్రదాయ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భోగి, మరియు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా శీ కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల, విజయవాడ బ్రాంచ్‌ నందు ఘనంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. గాంధీనగర్‌, బిఆర్‌టిఎస్‌ రోడ్డు ప్రక్కన, విజయవాడ (శారదా కాలేజీ ప్రక్కన) సంప్రదాయ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ విష్ణుభట్ల పద్మావతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విష్ణుభట్ల పద్మావతి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను పాఠశాల ప్రాంగణంలో పాఠశాల విద్యార్ధినులచే నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా బొమ్మల కొలువు, సంధ్యగొబ్బిల్లు, రంగవల్లులు, అందమైన ముగ్గులు, వివిధ సాంప్రదాయ వంటకాలతో దేవదేవుణ్ణి ఆరాధించి తీర్థప్రసాదాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మా పాఠశాల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని దీనితోపాటు విద్యార్దులకు అన్ని రకాలుగా అత్యాధునిక కంప్యూటర్‌ విజ్ఞానంతోపాటు ఇంటర్‌, డిగ్రీ వరకు విద్యాబోధనను నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధనా పద్ధతుల ద్వారా బ్రాహ్మణ విద్యార్ధినులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 2025-26 నుండి విద్యా సంవత్సరానికి 7-2-2025 నుండి నూతన విద్యార్ధునులకు ధరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో సిరిసంపదలతో వుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *