గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో భోగి పండుగ సందర్భంగా సోమవారం ప్రజా ప్రతినిధులు, అధికారులకు పూర్ణ కుంభం స్వాగతం, సన్నాయి మేళతాళాలు, భోగి మంటలు, గంగిరేద్దుల విన్యాసాలు, హరిదాసుల ఆట పాటలు, చిన్నారులకు భోగిపళ్లతో ఎన్టీఆర్ స్టేడియం పండగ శోభతో అలరారింది. ప్రత్యేక ఆకర్షణగా సంబరాలో ఎక్కువ మంది సాంప్రదాయక దుస్తులు ధరించి అలరించారు. సంబరాల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి లోగిళ్లు ప్రతి ఒక్కరికి గ్రామీణ వాతావరణంను చాటింది.
ఈ సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మాట్లాడుతూ జిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు కుటుంబ సభ్యులు అందరినీ అలరిస్తాయని, ప్రతి ఒక్కరూ సంబరాల్లో పాల్గొని ఆనందించేలా వివిధ కళారూపాలు, ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
ఎంఎల్ఏ గల్లా మాధవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి కుటుంబంలో భోగ భాగ్యాలు అందించాలని కోరుకుంటున్నామని, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
అనంతరం జెకెసి కాలేజి గ్రౌండ్ లో విలేకరులు, జిఎంసి ఉద్యోగుల టీం ల క్రికెట్ మ్యాచ్ లను కమిషనర్ టాస్ వేసి ప్రారంభించారు. సదరు పోటీల్లో జిఎంసి కమిషనర్ టీం విజేతగా, జిఎంసి ఉద్యోగుల టీం రన్నర్స్ గా నిలిచాయి.
సాయంత్రం సంబరాల్లో భాగంగా డప్పు వాయిద్యం, చెక్క భజన, తంబోలా, సాంప్రదాయ వస్త్ర పోటీలు, కూచిపూడి, ఫోక్ డ్యాన్స్ ప్రదర్శనలను నగర ప్రజలు ఎంతో ఆసక్తితో పెద్ద సంఖ్యలో తిలకించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, సిఎంఓహెచ్ డాక్టర్ అమృత, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నిర్వహణ కమిటి సభ్యులు డి.శ్రీనివాసరావు, విజయలక్ష్మీ, కాశయ్య, నసీర్ అహ్మద్, లోకేశ్వరరావు, ఉషారాణి, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …