సంక్రాంతి పండుగ అందరూ ఘనంగా చేసుకోవాలి

-తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి
-సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి..

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతిని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి  కమలా లక్ష్మీ దంపతులు రంగ రంగ వైభవంగా విజయవాడలోని తమ స్వగృహము నందు నిర్వహించారు మొదటిగా మంత్రివర్యుల పుణ్య దంపతులు భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించి గంగిరెడ్డిల భస్వన్న విన్యాసాలు తిలకించి భస్వన్న ఇచ్చే గౌరవ వందనం స్వీకరించి తిలకించారు అనంతరం కమలా లక్ష్మీ  గాలి పాతంగులను గాలిలోకి వదిలి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి దంపతులు.

తదనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

సంవత్సరం మొట్ట మొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి అని, ఇది రైతుల పండుగ అన్నారు. సాంప్రదాయాలు, అచారాలు మనదేశ సంపదని వాటిని గుర్తు చేసేదే ఈ సంక్రాంతి పండుగ అని మంత్రి గారు పేర్కొన్నారు. సూర్య భగవాణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో చీకటి తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. సూర్య భగవానుడు ఆశీస్సులతో రాష్ట్రంలోని, జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు అమలుకు ప్రజలు సహకరించాలన్నారు.రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే సకాలంకో వర్షాలు కురవాలి ప్రకృతి సహకరించాలని దానికి ఆ సూర్య భగవానుడి కరుణా కటాక్షం ఉండాలని అన్నారు సూర్య భగవానుడి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు తొలగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలన్నారు. భగవంతుని చల్లని దీవెనలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి తద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందాలన్నారు. సంక్రాంతి సందర్బంగా దేవుళ్ళ అందరి ఆశీస్సులతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అంతా మేలు జరుగుతుందన్నారు. నూజివీడు నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న అన్నారు.
రానున్న 3 సంవత్సరాల్లో అమరావతిలో దేశంలో ఎక్కడా లేని రాజధాని నిర్మించబోతున్న కూటమి ప్రభుత్వం
వరల్డ్ బ్యాంక్ ఆర్ధిక సహాయంతో దేశంలోనే నెంబరు 1 రాజధానిని నిర్మించబోతున్న కూటమి ప్రభుత్వం చిత్త శుద్దితో అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు వారి సంకల్పానికి మనమందరం సహకరించాలని కోరారు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం రోజుకి 14 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. భావి తరాల అభివృద్దే అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నీ పర్యటించి సాంకేతికను నూతన విధానాలన్ని జోడించి రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు అన్నారు త్వరలో చింతలపూడి ప్రొజెక్టును పూర్తి చేసి నియోజకవర్గ ప్రజల త్రాగు సాగు నీటి కష్టాలు త్వరలో తీరుస్తున్న ప్రభుత్వం మాది అన్నారు అలాగే గొప్ప విజన్ ఉన్న యువనాయకుడు మన నారా లోకేష్ బాబు అన్నారు ఎంతో అనుభవం చిత్త శుద్ది ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి అన్నారు. రైతుల నుండి ధాన్యం కొన్న 48 గంటల్లో నగదు జమ చేస్తున్న ప్రభుత్వం మాది మంత్రి 20 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నూజివీడు నియోజకవర్గంలో రూ,20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్న ప్రభుత్వము కూటమి ప్రభుత్వం
ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి అందించిన విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రజల ఆశలు , ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 5 ప్రధాన అంశాలపై చంద్రబాబునాయుడు సంతకాలు చేశారని, వాటిని పూర్తిస్థాయిలో నెరవేరుస్తున్నారన్నారు.రాష్ట్రంలో రూ.16 వందల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేదలకు పెన్షన్ ను 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచడమే కాక 3 నెలల బకాయిలను కూడా జులై, 1వ తేదీనే అందించారన్నారు. వికలాంగులకు రూ,6 వేలు,ఫెంక్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది అని మంత్రి అన్నారు, యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో కల్పిస్తామన్నారు.ఉచిత గ్యాస్ పంపిణీ దీపావళినుండి అందించామని రాష్ట్రంలోని 61 లక్షల మంది వృద్దులు, దివ్యాంగులకు ఒకటవ తేదీనే పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆర్ధిక విధ్వంసం చేసినప్పటికీ ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *