విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భోగి పండుగను తెలుగు ప్రజలందరూ ఘనంగా జరుపుకొని సంక్రాంతికి స్వాగతం పలికారు. భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను భోగి మంటలు వేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని స్నేహపూర్వక వాతావరణంలో భోగి మంటలను వేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు షేక్ బాజీ, నూతలపాటి బాల కోటేశ్వరరావు, యేదుపాటి రామయ్య, గుడివాడ నరేంద్ర రాఘవ, బోగవల్లి శ్రీధర్, గౌరీ శంకర్, ఆకుల శంకర్, మంతపురం రాజేష్, మక్కిన భాస్కర్, మైనంపాటి రమేష్, మల్లికార్జునరావు , భాను, మహేష్, బ్రహ్మారెడ్డి ,బేవర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమవారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …