-ప్రత్యేక ఆకర్షణ గా బొమ్మలకొలువు
-పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం
-పాల్గొన్న ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ మరియు డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు
-పూర్ణాహుతి తో ముగిసిన శివకామసుందరీ సమేత నటరాజ స్వామి వారి కల్యాణ మహోత్సవం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా సోమవారం ‘భోగి’ రోజున ఉదయాన్నే చిన్న రాజ గోపురం వద్ద ఉన్న ప్రాంగణం నందు భోగి మంటలు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమం నకు అదనపు కమీషనర్ మరియు ఆలయ ఈవో కే. రామ చంద్ర మోహన్ గారు హాజరై భోగి మంటలు వెలిగించి, సంక్రాంతి వేడుకలు ప్రారంభించుట జరిగింది. అనంతరం మహమండపం 7వ అంతస్తు లోని పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు మరియు ఇతర కళాకృతులను పరిశీలించారు.
మరియు ఈరోజు తేదీ.13-12-2024 న పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామదేను అమ్మవారి దేవస్థానం నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ వైదిక సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్ గారు పూజలు నిర్వహించి, కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. వివిధ రకముల కళాకృతులు, నాట్యములు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాగినది. భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో భక్తులు విశేషముగా పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో తో పాటుగా డిప్యూటీ కమీషర్.ఎం. రత్న రాజు పాల్గొన్నారు. అనంతరం, శ్రీ శివకామ సుందరి సమేతంగా నటరాజ్ స్వామి వారి ఆరుద్రోత్సవ కళ్యాణ ఉత్సవములు ది.11.1.2025 నుండి 13.1.2025 వరకు 3 రోజులు పాటు జరుపుటలో భాగముగా ఈరోజు అనగా తేదీ. 13-01-2025, సోమవారం రోజున పూర్ణహుతి కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించుట జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ప్రధానార్చకులు, వేదపండితులు మరియు వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.