-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఇమామ్ లు, మత పెద్దలతో తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుజనా చౌదరి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నెరవేర్చడం జరుగుతుందన్నారు. ముస్లిం, మైనార్టీలు అధికంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గం లో వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయవలసిన అభివృద్ధి పనులను పూర్తిచేసి విద్యా, వైద్యం, సంక్షేమం అందించడం యువతకు నైపుణ్యాభివృద్ధి లో శిక్షణ ఇవ్వటం మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి తదితర అంశాలపై ఇమామ్ లతో ముఖాముఖి చర్చించి సలహాలు, సూచనలను స్వీకరించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఇమామ్ లు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మీర్జా ముజఫర్ బేగ్, కూటమినేతలు పాల్గొన్నారు.