ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ రోజున ఆలయ ప్రాంగణములు వివిధ వర్ణముల పూలతో అలంకరించడం జరిగినది. సంక్రాంతి సందర్బంగా భక్తులు ఆలయమునకు విశేషముగా విచ్చేసి అమ్మవారిని, స్వామి వారిని దర్శించుకున్నారు మరియు ఆర్జిత సేవలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహమండపం 7 వ అంతస్తులోని పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, చెక్క బండి తదితర కళాకృతులు భక్తులను విశేషముగా ఆకర్షింపజేస్తున్నాయి.
Tags indrakiladri
Check Also
పండుగ పూటా ప్రజాసేవలోనే
-సంక్రాంతి వేడుకలకు కుటుంబ సమేతంగా సొంతూరుకి సీఎం -క్షణం తీరిక లేకుండా అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు హాజరు -సీసీ రోడ్లు, పాఠశాల …