విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్.బి కాలనీ కోదండ రామస్వామి దేవాలయం లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బిజెపి నాయకులు మువ్వల సుబ్బయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం పట్టు వస్త్రాలను సమర్పించారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అరాధ్య దైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం అని అన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు జింకా చక్రధర్, పోలు సాంబశివరావు, శివ నాగ సుబ్రహ్మణ్య గుప్తా, బోయపాటి నాని చౌదరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
