Breaking News

తెలంగాణా బిసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం బిసీలకి ద్రోహం చేయడమే…. : తమ్మిశెట్టి చక్రవర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు విజయవాడఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికావిలేకరుల సమావేశంలో ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ తెలంగాణా బిసి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ బివిల తరుపున తీవ్రంగా ఖండించారు. తెలంగాణ బిసి కులగణనలో బిసిలకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించి బిసీల హక్కుల కోసం గళం విప్పిన తీన్మార్ మల్లన్నని క్రమశిక్షణ పేరుతో అణిచివేయాలని చూడడం సరైన పద్ధతి కాదని, అన్నీ పార్టీలు బీసీలను కేవలం ట్రంప్ కార్డులుగా మాత్రమే చూస్తున్నారనటానికి ఇది ఒక నిదర్శనం అని అన్నారు. ఇకనుంచి బిసిలని పార్టీలు పార్టీ లైన్ పేరుతో గిరిగీసి కూర్చోపెట్టాలని చూస్తే ఊరుకొకూడదని బిసీల రాజ్యాధికారం కోసం గళమెత్తాలని బిసిల రాజ్యాధికార హక్కులకోసం పాటుపడాలని అటువంటి నాయకుల కోసం బిసిలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. అగ్రకులాలు బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే క్రమశిక్షణ పేరుతో తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తే ఇక బిసి నాయకులు చూస్తూ ఉండరని అందుకు తీన్మార్ మల్లన్ననే ఉదాహరణఅని అందరూ మల్లన్నను ఆదర్శంగా తీసుకున్నప్పుడే బిసిలకు రాజ్యాధికారం హక్కుగా వస్తుందని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాలలో బిసిలు ముఖ్యమంత్రులు అవ్వాలంటే బీసీలని క్రమశిక్షణ పేరుతో తొక్కిపెట్టె పార్టీలు తద్వారా ఓటుబ్యాంక్గా వాడుకునే పార్టీల కబందహస్తాలనుంచి బైయటకి రావాలని నాయకులని కోరారు. అవసరమైతే బిసిలు రాజ్యాధికారం కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి బిసిల సత్తాచాటాలని పిలిపిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *