Breaking News

నేర ప్రవృత్తిని విడనాడాలి సత్ప్రవర్తన తో మెలగాలి

-రౌడీ షీటర్లు భూ దందాలు, సెటిల్మెంట్లు, గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటాం
-ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం
-రౌడీ షీటర్ లో ఆయా గ్రామాలలో రౌడీయిజానికి దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
-పిడియాక్ట్ లు, కేసులు నమోదు చేయడం జరుగుతుంది
-నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని,ఎలాంటి గొడవలకు, భూదందాలకు పాల్పడకూడదని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన మెలగాలి, ఎలాంటి గొడవలకు, భూదందాలకు పాల్పడకూడదని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, దౌర్జన్యాలకు, అసాంఘిక కార్యకలాపాలకు,అలాగే గ్రామీణ ప్రాంతాలలో విద్వేషాలు సృష్టించకుండా ఉండాలని, అన్ని వివాదాలకు దూరంగా ఉండాలని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ హెచ్చరించారు. అలా కాకుండా గొడవలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తే పిడి యాక్ట్లు కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన రౌడీ షీటర్లను హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా రౌడీషీటర్లు, రౌడీయిజానికి పాల్పడినట్లయితే గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి మురళీకృష్ణ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, ఎస్సై మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *