Breaking News

పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడండి

-పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం సచివాలయములలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడినవి
-కేతన్ గార్గ్-కమిషనరు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024-2025 ఆర్ధిక సంవత్సరము ముగింపుకు వచ్చుచున్నందున బకాయివున్న ఆస్థిపన్ను యజమానులు వెంటనే తమ పన్నులు చెల్లించ వలసినదిగా కమిషనరు కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ది.31-03-2025 తేదితో ఆర్ధిక సంవత్సరము ముగియునున్నదని యజమానులు బాకీ ఉన్న తమ పన్నులను చెల్లించి మౌలిక సదుపాయాలు మరియు సేవలు పూర్తి స్థాయిలో అందించేందుకు తోడ్పడాలని కోరారు. నగరపాలక సంస్థ ఆధాయములలో ఇంటిపన్ను, ఖాళీస్థలము పన్ను మరియు నీటి చార్జీలు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయని, పన్నులు, పన్నేతరములు ఎంత ఎక్కువ శాతం వసూలు చేయగలుగుతే అంత అభివృధ్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. అందువలన బకాయిదారులు వెంటనే పన్నులు చెల్లించాలని, లేని యెడల నగరపాలక సంస్థ చట్టములో నిర్దేశించిన ప్రకారము అత్యవసర సర్వీసులయిన కుళాయి కనెక్షను మరియు విద్యుత్ కనెక్షను నిలుపుదల చేయుటయే కాక ఆస్థి జప్తుకి చట్టప్రకారము చర్యలు తీసుకొనబడును. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నందు ఏర్పాటు చేయబడిన కౌంటర్లతో పాటు నగరంలోని ఈ దిగువ సచివాలయములలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడమైనది.

1) వి.ఎల్.పురం ప్రాంతము నందు సచివాలయము నెం.23,

2) ప్రకాష్ నగర్ మీసేవా నందు గల సచివాలయము నెం.14,

3) సీతంపేట మీసేవా నందు గల సచివాలయము నెం.81,

4) కోటిపల్లి బస్టాండు మీసేవా నందు గల సచివాలయము నెం.36,

5) నారాయణపురం సచివాలయము నెం.3,

6) బొగ్గులదిబ్బ సచివాలయము నెం.42

7) బర్మా కాలనీ సచివాలయము నెం.89

సదరు కౌంటర్ల నందు ఉదయం గం.9:00 ల నుండి సాయంత్రం గం.4:00 వరకు ఇంటిపన్ను, ఖాళీస్థలము పన్ను మరియు నీటి చార్జీలు చెల్లించవచ్చును.

 

కావున ఆస్థిపన్ను చెల్లింపుదారులు పైన తెలిపిన వార్డు సచివాలయములలో పన్నులు మరియు పన్నేతరములు చెల్లించి ఈ సదవకాశమును ఉపయోగించుకొనవలసినదిగా తెలియచేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *