-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
-ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాలలో రబీ సాగు తర్వాత వేసవి పంటల సాగు.
-వేసవిసాగు ద్వారా నేలలోని తేమ ,పోషకాలను పూర్తి స్థాయిలో వినియోగం
-వేసవి అపరాల సాగులో మినుము,పెసర , పిల్లిపెసర లో వాటి వేర్ల ద్వారా ,రాలిపోయిన ఆకులు నేలలో కుళ్ళటం ద్వారా మరింత సేంద్రీయ పదార్థం నేలకు అందే అవకాశం
-వేసవి పంట సాగుకు అనువైన స్వల్పకాలిక అపరాలు గా మినుము ,పెసర ; పచ్చిరొట్ట పైర్లుగా జనుము , పిల్లిపెసర; గడ్డి కోసం నేపియర్ గడ్డి ,కాకి జొన్న మరియు నూనె గింజలలో నువ్వులు అనుకూలమైనవి , అంతే కాకుండా నేలబారు పంటలుగా నేలలను కప్పివుంచి ,సూర్యరశ్మి ,ఎండ ప్రత్యక్షముగా నేలలకు తగలకుండా ,నేలలోని తేమ ఆవిరి అవ్వకుండా భూములను రక్షిస్తుంటాయని తెలిపారు .
-ఆదునీకరించిన కొత్త వెర్షన్ 4 ఈ పంట అప్లికేషన్ ద్వారా ఈ నెల 3 వ తారీకు నుండి అమలులోఉన్న వేసవి పంటల ఈ పంట నమోదులో కొత్తగా ప్రకృతి వ్యవసాయం లోని పి యం డి యస్ PMDS – తొలకరి ఋతుపవనాలకు ముందే విత్తే పంటలను కూడా చేర్చడం జరిగిందని తెలిపారు .
-వ్యవసాయ మరియు రెవెన్యూ జాయింట్ యాజమాయిషీ లో నమోదవుతున్న ఈ పంట కు మార్గదర్శకాలు గత రబీ సీజన్ కు సంబంధించిన వాటిని అనుసరించ వలసినదిగా తెలిపారు .
-మార్చి నెల నుండి ఏప్రిల్ మొదటి వారంలో విత్తుకుని ,ఈ వేసవిలోనే పంట కాలం ముగించుకునే పంటలను మాత్రమే ఈ విధానములో నమోదు చేయాలని, మరియు ఈ నెలాఖరుకు నమోదు ప్రక్రియ ముగించాలని ఆదేశించారు .
-వేసవి పంట సాగు లో ఈ పంట నమోదు ద్వారా వాటి సాగు విస్తీర్ణం ,దిగుబడి అంచనాలు మరియు పంటల సాగు విధానములో వరుస పంటల సరళి పై అధ్యయనానికి ,గణాంకముల సేకరణకు దోహద పడుతుందని తెలిపారు.
Tags amaravathi
Check Also
పెట్టుబడులతో రండి..భరోసా కల్పించే బాధ్యత మాది
-ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ 2వ రోజు వర్క్ షాప్ లో జాతీయ, అంతర్జాతీయ …