రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రిలో ఏప్రియల్ 25 న మెగా జాబ్ మేళా యువతకు ఉద్యోగావకాశాలు తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున APSSDC & Govt. College (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా **రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం) ••లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 30కు పైగా పేరొందిన ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఐటి, హెల్త్కేర్, రీటైల్, లాజిస్టిక్స్, సేల్స్ & మార్కెటింగ్, తయారీ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలను ఈ కంపెనీలు కల్పించనున్నాయి.
ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
: https://naipunyam.ap.gov.in/user-registration
అభ్యర్థులు తమతో తీసుకురావాల్సినవి:
అప్డేటెడ్ రెజ్యూమే
ఆధార్ కార్డు, విద్యా అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
సమయము: ఉదయం 9:30 గంటలకు హాజరుకావలెను
వేదిక: గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), రాజమండ్రి
ఈ జాబ్ మేళా ద్వారా నైపుణ్యాలున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించబడుతోంది. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము.
మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి:
9988853335, 8712655686, 8790118349, 8790117279 (సంప్రదించగల సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
Prajavartha Online Telugu News