విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వశోభాయమానమైన అలంకృత వాహనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పోలీస్ పేరేడ్ ను పరిశీలించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్యదినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెరేడ్ కమాండర్ , విశాఖపట్నం రూరల్ అడిషినల్ యస్ పి యస్. సతీష్ కుమార్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డిని పెరేడ్ పరిశీలనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనితో పెరేడ్ పరిశీలనకు ప్రత్యేక అలంకృతవాహనంలో ముఖ్యమంత్రి వాహనంలో తరలివెళ్లారు. తొలుత పెరేడ్ కమాండర్ యస్. సతీష్ కుమార్ ముఖ్యమంత్రి దగ్గర మార్చ్ ఫాస్ట్ కు అనుమతి తీసుకుని మార్చ్ఫాస్టు ఆయన నేతృత్వం వహించారు. ప్రతి అడుగులో దేశభక్తిని సంపూర్ణంగా నింపుకుని వివిధ దళాలు ప్రదర్శించిన కవాతు అందరిని పులకరించింది. మార్చ్ ఫాస్ట్ లో కర్నూలు ఏపియస్ పి 2వ బెటాలియన్ అగ్రభాగంలో నిలవగా తర్వాత కాకినాడ ఏపియస్ పి 3వ బెటాలియన్, విజయనగరం ఏపియస్ పి 5వ బెటాలియన్, కడప ఏపియస్ పి 11వ బెటాలియన్, విశాఖపట్నం ఏపియస్ పి 16వ బెటాలియన్, ఏపి సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ 6వ కంటెంజెంట్ గా మార్చ్ మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. బ్రాస్ బ్యాండ్ విధానం క్రింద కర్నూలు ఏపియస్ పి రెండవ బెటాలియన్, కాకినాడ ఏపియస్ పి 3వ బెటాలియన్, విజయగనరం ఏపియస్ పి 5వ బెటాలియన్, మంగళగిరి ఏపియస్ పి 6వ బెటాలియన్, వెంకటగిరి ఏపియు 9వ బెటాలియన్, భాస్కర్ పేట ఏపియస్ పి 11వ బెటాలియన్, అనంతపురం ఏపియస్ పి 14వ బెటాలియన్, మంగళగిరి ఏపియస్ పి పైప్ బ్యాండ్, హైదరాబాద్ ఏపియూనిట్ యప్స్ఆర్ సిపియల్, సిపియల్ కవాతులో పాల్గొన్నాయి. తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పైప్ బాండ్ కవాతులో పాల్గొని అద్భుత విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా కవాతులో ప్రధమ ఉత్తమ ప్రదర్శనగా కర్నూలు ఏపియస్ పి 2వ బెటాలియన్, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా విజయగనరం ఏపియస్ పి 5వ బెటాలియన్లు నిలవగా, తృతీయగా ఉత్తమ ప్రదర్శనగా ఏపి సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కంటెంజెంట్ నిలవగా, ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పైప్ బాండ్ కన్సలేషన్ బహుమతిని పొందింది. వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మెమెంటోలను బహుకరించారు. ఈకార్యక్రమానికి తమదైన శైలిలో పి. రాజేందర్ ప్రసాద్ తెలుగులోను, కుమారి పి.జుహిత ఆంగ్లంలో అందించిన వ్యాఖ్యానం స్వాతంత్య దినోత్సవ వేడుకలకు ఆహ్లాదాన్ని, శోభను చేకూర్చింది.
రాష్ట్రానికి చెందిన పలువురు పోలీస్ సిబ్బందికి పోలీస్ మెడను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అందజేసారు. అత్యుత్తమ సర్వీసు క్రింద పోలీస్ మెడల్స్, ఉత్తమ సేవలకు ఇండియన్ పోలీస్ మెడల్స్, గాలంటరీ, జీవన్ రక్ష పధక్ క్రింద పోలీస్ మెడల్స్ ను అందజేసారు.
కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ముఖ్యమంత్రి సతీమణి వై.యస్. భారతి, రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత , రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర డిజిపి డి.గౌతంసవాంగ్, మహిళా కమిషన్ ఛైర్మన్ వాసి రెడ్డి పద్మ, ఏపి ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కొలుసు పార్థసారథి, మొండితోక జగన్మోహనరావు, జోగి రమేష్, కె. అనీల్ కుమార్, ఏపి వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యంవియస్. నాగి రెడ్డి, తెలుగు అకాడమి ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, జిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఏపియస్ పి బెటాలియన్స్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ డా. శంకబ్రతబాగ్చి, నగర సిపి బత్తిన శ్రీనివాసులు, జిల్లా కలెక్టరు జె.నివాస్, ప్రొటోకాల్ డైరెక్టరు యం. బాలసుబ్రహ్మణ్య రెడ్డి, వియంసి కమిషనర్ వి.ప్రసన్నవెంకటేష్, సబ్ కలెక్టరు జియయస్. ప్రవీణ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.