కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజినల్ పౌర సంబంధాల అధికారి ఎమ్. లక్ష్మణాచార్యులు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ చేతులు మీదుగా ఉత్తమ అధికారిగా మెరిట్ అవార్డ్ ను అందుకున్నారు. ఆదివారం మచిలీపట్నం లో నిర్వహించిన కృష్ణా జిల్లా 75వ వేడుకల్ని నిర్వహించారు. కోవిడ్ సమయంలో గత 15 నెలలుగా సమాచార శాఖ రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడలో పిఆర్వో గా అందించిన సేవల నేపథ్యంలో అవార్డ్ ను ప్రకటించారు. లక్ష్మణాచార్యులు కు అభినందనలు తెలిపిన వారిలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ లు కె.మాధవిలత, ఎల్. శివ శంకర్, కె.మోహన్ కుమార్, సమాచార శాఖ కృష్ణా జిల్లా డిడి మెహబూబ్ బాషా, పశ్చిమగోదావరి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డి. నాగార్జున, డివిజినల్ పిఆర్వో లు రామచంద్రరావు, శ్రీనివాసరావు, టి.నాగేశ్వరరావు, కాశీ, రాజేష్, తదితరులు ఉన్నారు.
Tags kovvuru
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …