దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ-ఉప్పలూరు మధ్య విద్యుదీకరణతో సహా డబుల్‌ లైన్‌ ప్రారంభం…


-దీని ద్వారా విజయవాడ`గుడివాడ-భీమవరం టౌన్‌ మరియు గుడివాడ-మచిలీపట్నం మధ్య 141 కి.మీ మేర
నిరంతరాయమైన విద్యుదీకరించిన డబుల్‌ లైన్‌ సౌకర్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ`ఉప్పలూరు డబుల్‌లైన్‌లో17 కి.మీ మేర డబుల్‌ లైన్‌ మరియు విద్యుదీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభించింది. విజయవాడ-ఉప్పలూరు స్టేషన్ల మధ్య విద్యుదీకరణతో సహా డబ్లింగ్‌ పూర్తి కావడంతో విజయాడ`గుడివాడ`భీమవరం టౌన్‌ మరియు గుడివాడ-మచిలీపట్నం మధ్య 141 కి.మీ మేర నిరంతరాయంగా విద్యుదీకరణతో సహా డబుల్‌లైన్‌ పూర్తి చేసినట్టు అయ్యింది.
విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్‌, గుడివాడ-మచిలిపట్నం మరియు నర్సాపూర్‌-నిడదవోలు డబ్లింగ్‌ మరియు విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యుదీకరణతో సహా డబుల్‌ లైన్‌ పనులు పూర్తిచేసి ప్రారంభించబడినాయి. రూ.3000 కోట్ల అంచనా వ్యయంతో 221 కిమీ దూరం గల ఈ ప్రాజెక్టు 2011-12 సంవత్సరంలో మంజూరు చేయబడిరది. ఆర్‌వీఎన్‌ఎల్‌ (రైల్‌ వికాస్‌ నిగం లిమిటెడ్‌) వారు ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మరియు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. 221 కిమీ మేర గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం141 కిమీ మేర పనులు పూర్తయ్యి ప్రారంభించబడ్డాయి. మిగిలిన సెక్షన్లలో అంటే నిదడవోలు-నర్సాపూర్‌ మధ్య 70 రూట్‌ కిమీ మేర పనులు వేగవంతంగా సాగుతూ చివరి దశకు చేరుకున్నాయి.

విద్యుదీకరణతో సహా డబుల్‌ లైన్‌ పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులోని ముఖ్యాంశాలు :
-గంటకు 110 కిమీ వేగం సామర్థ్యంతో 25 టి యాక్సెల్‌ లోడ్లను తట్టుకునేలా ట్రాక్‌ మొత్తం రూపొందించబడిరది.
-పీఎస్‌సీ గిర్డర్లతో 2 ప్రధాన వంతెనలు మరియు 18 చిన్న వంతెనలు నిర్మించబడినాయి.
-ఉప్పలూరు, నిడమానూరు మరియు రామవరప్పాడు స్టేషన్లలో ప్రణాళికబద్ధమైన సర్క్యూలేటింగ్‌ ఏరియా, టికెట్ల బుకింగ్‌ ప్రాంతం ఏర్పాటు, సౌకర్యవంతమైన ప్లాట్‌ఫారాలు, తాగు నీటి సౌకర్యం, పాదచారుల వంతెనలు మొదలగు ప్రయాణికుల సౌకర్యాలను పటిష్టపరిచారు.
-ఉప్పలూరు, నిడమానూరు మరియు రామవరప్పాడు స్టేషన్ల యార్డులను ఆధునిక సౌకర్యాలతో సహా ప్రామాణిక డబుల్‌ లైన్‌ లేఔట్‌తో పునర్నిర్మించారు.
-అవసరమైన చోట్ల కట్‌ అండ్‌ కనెక్షన్‌ విధానాన్ని అవలంబించారు. అందువల్ల దాదాపు లైన్‌ అంతా గరిష్ట వేగం అనుమతులతో ప్రారంభించబడిరది.
-అత్యధిక స్థాయిలో భద్రతా ప్రమాణాలు కల్పించేలా ఉప్పలూరు, నిడమానూరు, రామవరప్పాడు 3 స్టేషన్లలో దేశీయంగా రూపొందించిన సెంట్రలైజ్డ్‌ ఆర్కిటెక్చర్‌ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ ఏర్పాటు.
-సెక్షన్‌లో 7 రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద మంచి రహదారులు మరియు సూచిక బోర్డులతో విద్యుత్‌తో నిర్వహించే లిఫ్టింగ్‌ బారియర్స్‌ ఏర్పాటు.

ఈ ప్రాజెక్టుతో ప్రయోజనాలు :
-సరుకు రవాణా మరియు ప్రయాణికుల రవాణా నిరాటంకంగా సాగడానికి రైలు రవాణా మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్టుతో గణనీయంగా పటిష్టపరచబడినాయి.
-నూతన డబ్లింగ్‌ లైన్‌ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రైలు రవాణా మెరుగుపడుతుంది.
-వ్యవసాయం మరియు ఆక్వా ఉత్పత్తుల రవాణాను ప్రోత్సాహించి ఆయా రంగాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
-ఈ విద్యుదీకరణ పనులు ఇంధన పొదుపు మరియు ఇంధన ఖర్చు తగ్గింపుకు దోహదపడుతుంది.
-విజయవాడ-విశాఖపట్నం మధ్య కోస్తా రైల్వే కారిడార్‌కు ప్రత్యామ్నాయ రైల్వే లైన్‌గా దోహదపడుతుంది.

షెడ్యూల్‌ ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసిన విజయవాడ డివిజన్‌ మరియు ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులు మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించారు. సానుకూల విధానంతో ముందుకు సాగి పూర్తి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి ఆంధ్రపదేశ్‌లోని కోస్తా ప్రాంత ప్రజల అవసరాలను నెరవేర్చాలని జనరల్‌ మేనేజర్‌ ఆర్‌వీఎన్‌ఎల్‌ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తికావడానికి కావాల్సిన తోడ్పాటును అందించాలని ఆయన రైల్వే అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *