Breaking News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఏర్పాట్ల పై కలెక్టర్ పి ప్రశాంతి దిశా నిర్దేశనం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
*అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు , సైన్స్ మ్యూజియం, అటవీ అకాడమీ ప్రారంభోత్సవం తదితర పలు కార్యక్రమాలలో గురువారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఏర్పాట్ల పై కలెక్టర్ పి ప్రశాంతి దిశా నిర్దేశనం చేశారు. కేంద్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలుత అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన అనంతరం , రాజవోలు రహదారి మార్గంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ మ్యూజియం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి దివాన్ చెరువులో అటవీ అకాడమీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. జూన్ 26వ తేదీన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుందని తెలిపారు. అదే ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ నుంచి కేంద్ర మంత్రి తో బయలు దేరి బొమ్మూరు సమీపంలో ఉన్న సైన్స్ మ్యూజియం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

తదుపరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె . పవన్ కళ్యాణ్ దివాన్ చెరువులో ఏర్పాటు చేసిన అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అకాడమీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొననున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను స్థానిక ఎస్పీ అధ్వర్యంలో ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. తొలిసారి నగరంలో బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాదరణ ఉన్న నేత కావడంతో కార్యక్రమానికి ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందనీ , ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలకు తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచనలు చేయడం జరిగింది.

పుష్కర్ ఘాట్ లో శంకుస్థాపన శిలాఫలకం ఎక్కడ ఏర్పాటు చేయాలి, సభా వేదికను ఎక్కడ నిర్ణయించాలనే అంశాలపై ప్రజా ప్రతినిధులు సూచనలు, భద్రతా అంశాలను ప్రోటోకాల్ అనుసరించి చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తదితరులు సైన్స్ మ్యూజియం సందర్శన ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపు, క్లౌడ్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చెయ్యడం జరిగింది.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఎస్పి డి నరసింహ కిషోర్ , డి ఆర్వో టి సీతారామ మూర్తి , అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఇతర సమన్వయ శాఖలు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *