రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో ఆశా కార్యకర్తలు పోస్టులు భర్తీ కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరణ. తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయుటకు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనపర్తి-3, బిక్కవోలు-1, రంగంపేట-2, రాజమహేంద్రవరం రూరల్-4, కడియం-3, రాజానగరం-2, కోరుకొండ-2, సీతానగరం– 2, గోకవరం-1, దేవరపల్లి-3, నల్లజెర్ల-2, తాళ్ళపూడి-1, కొవ్వూరు రూరల్-1, చాగల్లు-1, పెరవలి-1, ఉండ్రాజవరం-1, మండలాలలో 30 ఆశా కార్యకర్తలు పోస్టులకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె వెంకటేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
దరఖాస్తు ప్రక్రియ 28-06-2025 నుండి 05-07-2025 వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలియజేయడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హతలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం మరియు www.eastgodavari.nic.in పొందుపరచడం జరిగింది తెలియజేశారు.
Prajavartha Online Telugu News