నేటితరంలో మహిళా శ్రేయస్సుకు నాంది పలికిన వైతాళికుడు సియం వై.యస్. జగన్మోహన రెడ్డి…

-సియం జగన్మోహనరెడ్డి విధానాల వల్ల కుటుంబంలో మహిళలకు పెరిగిన గౌరవం…
-రాష్ట్రంలోని మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన వాసిరెడ్డి పద్మ..
-2014-19 మధ్యకంటే గత రెండేళ్లలో 4 శాతం తగ్గిన క్రైమ్ రేటు..
-ప్రతిపక్షాలు చేస్తున్న యాగి వలన మహిళలకు తీరని నష్టం..
-రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలకు అన్నిరంగాలలో ప్రాధాన్యత ఇస్తూ నేటితరంలో మహిళా శ్రేయస్సు, సంక్షేమానికి నాంది పలికిన వైతాళికుడు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయ మీడియా పాయింట్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళారక్షణ, సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వాసిరెడ్డి పద్మ వివరించి రాష్ట్ర మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగానికి ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని ఆమె పేర్కొన్నారు. ఈసందర్భంగా కొంతమంది అధికారులకు రాఖీలను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కట్టారు. మహిళల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తూ అందమైన భవిష్యత్తు కల్పిస్తున్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డిని తమ సోదరుడిగా ప్రతీ ఆడపడుచూ తమ హృదయాలలో రాఖీ కట్టాలని రక్షాబంధన్ పందర్భంగా గుర్తు చేస్తున్నామన్నారు. మంచిపమలు చేసినవారికి కృతజ్ఞతలు తెలపడం మన మహిళల యొక్క పంప్కృతి అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు అన్నిరంగాల్లో 50 శాతం భాగస్వామ్యం కల్పిస్తూ, మహిళల తలరాతలు మార్చేలా ముఖ్యమంత్రి విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆమె అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రెండేళ్ల కాలంలో మహిళా రక్షణ, అభివృద్ధి, సంక్షేమానికి అనేక వినూత్న పథకాలను అమలు చేసి మహిళల చేత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మహిళా వైతాళికుడిగా కొనియాడబడుతున్నారని అన్నారు. రాఖీ రక్షాబంధన్ పేరులోనే మనకున్న గొప్ప సంస్కృతి తెలుస్తుందన్నారు. ప్రతి ఊరూ, ప్రతిరాష్ట్రం , ప్రతి దేశం మహిళలకు రక్షణగా నిలవాలని, ఇదే సందేశాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని ఆమె అన్నారు. ఒక చెల్లెలుకు ఒక అన్న ఇచ్చే బహమతిని రాఖీపండుగ రూపంలో ఇంత గొప్పగా జరుపుకుంటున్నామని, కోట్లాది మంది మహిళలకు కానుకగా ఒక అమ్మఒడి, ఇంటి స్థలాలు, వైయస్ఆర్ చేయూత, చిరువ్యాపారాలకు రుణాలు, దిశచట్టం అమలు, మొదలగు చారిత్రాత్మక పధకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి మహిళా లోకం అంతా రాఖీ పండుగ రోజున అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. గత ప్రభుత్వాలు మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని మహిళల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ చేతులు దులుపుకున్నాయని జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ప్రతీ మహిళకూ మేలు కలిగేలా పధకాలను రూపొందించి అమలు చేస్తున్నదన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు వల్ల మహిళా లోకానికి తీరని అన్యాయం జరుగుతున్నదన్నారు. ఒకటి, రెండు సంఘటనలు వల్ల ఏపిలో మహిళలకు రక్షణ లేదని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం తగదని, మహిళలు బయటకు రాకూడదనే భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కొంతమంది మహిళల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఎన్ని సంఘటనలు జరిగినా వారిని ఆదుకున్న పరిస్థితులు లేవని వాసిరెడ్డి పద్మ అన్నారు. గతంలో మహిళలపట్ల జరిగిన అఘాయిత్యాలు పై ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందికి సహాయం అందించారు అనే వాటి పై ప్రతిపక్షం చర్చకు సిద్ధమా? అని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి జగన్నాహన రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి 24 గంటల్లో అరెస్టులు చేపి తగిన చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మహిళా సాధికారిత అనేది కుటుంబం మండే అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతుందని ఆమె అన్నారు. ఏ ప్రభుత్వ పధకం చూపినా మహిళలను లబ్దిదారులుగా గుర్తించి వారికి ప్రభుత్వం చేయూతను అందించుట ద్వారా వారు స్వయం ఉపాధి సాధించగలుగు తున్నారని ఇది విప్లవాత్మకమైన మార్పు అని వాసిరెడ్డి పద్మ అన్నారు. సాధికారిత అంటే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి పరంగా మహిళలకు చేయూతనివ్వడమేనని ఈ ప్రభుత్వం 50 శాతం మహిళా భాగస్వామ్యం కల్పించి మహిళలను అన్ని విషయాల్లోనూ ముందంజలో నిలిపిందని ఆమె అన్నారు. మనరాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, మొదలగు అభ్యుదయ వ్యక్తులు మహిళల కొరకు పాటుపడితే నేటి తరంలో జగన్మోహన రెడ్డి తాను వేసే ప్రతి అడుగులోనూ మహిళా సంక్షేమానికి పాటుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకూ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారం వేరాల పంఖ్య పెరుగుతూ వచ్చిందని ఈప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2020, 2021వ పంవత్సరాలలో వేరాల పంఖ్య 4 శాతం తగ్గిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలు, బాలికలపట్ల జరిగే అఘాయిత్యాలకు పంబంధించి మానవ మృగాలుగా మారిన వారిని, అందుకు బాధ్యులైన వారిని 24 గంటల్లోగా అరెస్ట్ చేపి ఛార్జిషీటు దాఖలు చేస్తున్నామని ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. మహిళల కోసం తపనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వెంటనే పోలీస్ శాఖ, ఉమెన్ కమిషన్ స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజకీయాల్లో మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ప్రస్తుత రోజుల్లో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి 50 శాతం మహిళలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ తీసుకున్న చారిత్రక నిర్ణయం ప్రతీ మహిళా అభినందించవలసిన విషయమని ఆమె అన్నారు. ఏ గ్రామంలో చూసినా ఒక మహిళా ప్రతినిధుల ఫ్లెక్సీలు ఉంటున్నాయని మహిళలకు కుటుంబంలోనూ, రాజకీయాల్లోనూ ప్రభుత్వంలోనూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ముఖ్యమంత్రి మహిళలకు అమలు చేస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో రాఖీ పండుగ రోజున ప్రతీ మహిళా ముఖ్యమంత్రిని తన అన్నగా భావించి గుర్తుంచుకోవాల్సిన రోజు అని అన్నారు. దిశచట్టం ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపామని కేంద్రం ఆమోదించవలసి యున్నదని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ డైరెక్టరు సూయజ్. మహిళా కమిషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *