ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం స్పూర్తిదాయకం…

-సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు.
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచిన ధైర్యశాలి టంగుటూరి ప్రకాశం పంతులని ఆయన పేర్కొన్నారు. ఆయన దేశభక్తి, త్యాగనిరతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా వారి సేవలను, దేశభక్తిని స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏఓ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి డిఇవో ఎల్. చంద్రకళ, డిఎల్ పివో కె.పి చంద్రశేఖర్, సిడిపివో ఎస్. సువర్ణ, ఆర్టీసీ డిపో మేనేజర్ కె. బసవయ్య, వ్యవసాయ శాఖ ఏడి. యం. సునీల్, హౌసింగ్ అధికారి బిఎస్ రవికుమార్, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *