Breaking News

ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం

-ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
-ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి
-జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు
-గిరిజన ఆదివాసీ విద్యార్థులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీ ను. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ఆదివాసీలు తమ సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూ జీవిస్తున్నారని, గతంలో మారుమూల అరణ్యాలలో రహదారులు, వైద్యం, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి నిర్మాణం, మెరుగైన విద్య, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. కనీస మౌలిక వసతుల కోసం 200 కోట్ల రూపాయలతో రహదారి ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఆరోగ్య రక్షణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో కొందరు గంజాయి వంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి నప్పటికీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల వారు సన్మార్గంలోకి వచ్చి సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ప్రభుత్వ పథకాల ద్వారా జీవనోపాధి పొందేలా శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధునిక సదుపాయాలు, ఉన్నత విద్యా అవకాశాలు అందించి ఆదివాసీల భవిష్యత్తు బంగార మయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, భవిష్యత్తులో వారు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరేలా అన్ని విధాల సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక, పలువురు ఆదివాసీ గిరిజన ప్రతినిధులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *