Breaking News

ఈనెల ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ క్రీడాపాధికార సంస్థ ఆదేశములపై ఈనెల ఆగస్టు 29 న హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించు జాతీయ క్రీడా దినోత్సవము పురస్కరించుకొని రాష్ట్రము మొత్తము 10 క్రీడాంశములలో ( అథ్లెటిక్స్, ఆర్చరీ బ్యాడ్మింటన్,బాస్కెట్బాల్, బాక్సింగ్,హాకీ,కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ) అండర్ 22 వయసుగల పురుషులకు మరియు మహిళలకు జిల్లాస్థాయి ( ఆగస్టు 5 నుండి 15 వరకు )నుండి జోనల్ స్థాయి ( ఆగస్టు 16 నుండి 20 వరకు, ఐదు నుండి ఏడు జిల్లాలు కలిపి), తదుపరి జోనల్ స్థాయి నుండి రాష్ట్రస్థాయి ( ఆగస్టు 21 నుండి 25 వరకు )ఈ పోటీలు నిర్వహణ చేయడం జరుగుతాయి.
శాప్ ఆదేశములపై శ్రీయుత జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా వారి అనుమతితో ఈరోజు ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల,రాజమహేంద్రవరం లో కబడ్డీ మరియు ఖో -ఖో క్రీడలలో సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్ కి సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం లో ముఖ్యఅతిధి అయినటువంటి శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ గారు మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులలో కూడా రాణించాలని క్రీడాకారులను కోరారు. ప్రభుత్వం క్రీడలకు 2 శాతం నుండి 3 శాతం వరకు రిజర్వేషన్ పెంచిన విషయం తెలియచేసారు. ఈ కార్యక్రమం లో కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ త్రిమూర్తులు మాట్లాడుతూ ఒకొక్క కీడాకారుడు మీ మీ స్నేహితులను ఒకొక్కరిని క్రీడా ప్రాంగణం కి తీసుకొని రావాలని తెలియచేసారు. ఎస్. జి. ఎఫ్. సెక్రటరీ స్వామి గారు, వ్యాయామ సంఘ అధ్యక్షులు ఎవిడి ప్రసాద్ మరియు కార్యదర్శి నాగరాజు ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు కోచులు మోహన్ దాసు నాగేంద్ర పాల్గొన్నారని డి. ఎస్. డి. ఓ. డి.ఎం. ఎం. శేషగిరి తెలియచేసారు.
10-8-25 న
1.ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్స్ హాకీ వాలీబాల్.
2. ప్రభుత్వ ఎస్ కే వి టి డిగ్రీ కళాశాలలో ఉదయం బాక్సింగ్ సాయంత్రం బాస్కెట్ బాల్.
3. మోడరన్ కాలనీ పార్కులో ఆర్చర
4. భారతీయ వ్యాయామ కళాశాలలో వెయిట్ లిఫ్టింగ్.
5. కె ఎస్ ఎన్ బ్యాట్మెంటన్ అకాడమీ, నారాయణపురంలో బ్యాడ్మింటన్. అన్ని క్రీడలు 22 సంవత్సరంలోపు వారు, బ్యాడ్మింటన్ 19 సంవత్సరాలు లోపు వారు అర్హులు. వీరు సెలక్షన్ కి వచ్చేవారు తప్పకుండా జన దృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ ఫోటోలు మరియు జిల్లాస్థాయి నుండి జోనల్ స్థాయికి వెళ్లేవారు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ నకలు తీసుకొని రావాలని జిల్లా క్రీడా అధికారి తెలియపరిచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *