రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నగరంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఆగస్ట్ 11వ తేదీన ” జాబ్ మేళ” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హెచ్ . హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపేనీలైన ఇన్నోవా సోర్స్, ఎస్ బి ఐ పేమెంట్, నవతా, ఆపాక్ ఫైనాన్సియల్ సర్వీస్ నందు గల పలు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఇందులో వివిధ ఉద్యోగాలలో పని చేయడానికి 10వ తరగతి , ఇంటర్, ఇతర ఏ డిగ్రీ చదివిన వారు, అనుభవం కలిగినా అధ్యాపకులకు 19 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు గల వారు అర్హులని ఆయన వివరించారు. ఆ రోజున నిర్వహించే “జాబ్ మేళా” కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి , తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://tinyurl.com/jf1may25 నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి సదరు “జాబ్ మేళా” కు రెజ్యూమెలతో పాటు ఆధార్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో, సిద్ధపడి ఆగస్టు 11వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మోడల్ కెరీర్ సెంటర్, రాజమహేంద్రవరం వద్దకు రావాలని జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాలకు “95332 21189” నంబర్ల ను సంప్రదించాలని సూచించారు. సంప్రదించాల్సిన సమయం ఉ.10.00 to సా.5.00 వరకు.
Prajavartha Online Telugu News