Breaking News

రూరల్ మండలంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు, రాజమండ్రి డివిజన్ పరిధిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ తెలిపారు. ఆదివారం, రాజమండ్రి రూరల్ మండలంలో మండల స్థాయి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15న జరగబోయే 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఇంటి పై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి, జాతీయ స్పూర్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహసిల్దార్ శ్రీనివాస్, ఇంచార్జి ఎంపిడివో సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *