Breaking News

సహోద్యోగి వైద్య చికిత్సకు జైలు సిబ్బంది ఔదార్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ ఆధ్వర్యంలో, సెంట్రల్ జైలు అధికారులు మరియు సిబ్బంది మానవీయ విలువలు, ఐక్యతకు నిదర్శనంగా ముందుకు వచ్చారు. జైలు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ ఎన్. విజయ్ కుమార్  గొంతు క్యాన్సర్ చికిత్స కోసం స్వచ్ఛందంగా రూ.1,19,000/- (ఒక లక్ష పత్తొమ్మిది వేల రూపాయలు) సేకరించి అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ మాట్లాడుతూ, “బాధలో ఉన్న సహోద్యోగికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి మానవీయ బాధ్యత. ఇలాంటి సేవా కార్యక్రమాలు సిబ్బందిలో ఐక్యతను, పరస్పర నమ్మకాన్ని పెంపొందిస్తాయి” అని పేర్కొన్నారు. జైలు సిబ్బంది ఈ చర్య సహానుభూతి, ఔదార్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. సహచర ఉద్యోగుల చేయూత నివ్వడం పట్ల విజయ్ ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ సందర్భంలో పర్యవేక్షణాధికారి ఎం. రాజ్ కుమార్, గార్డింగ్ సిబ్బంది సతీష్, సురేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *