Breaking News

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు

అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి, తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందనీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఒక ప్రకటనలో తెలియచేసారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి , గృహ నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండి పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందనీ తెలిపారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు గండి పోచమ్మ తల్లి చిత్ర పటాన్ని అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *