నులిపురుగుల నివారణకు రాష్ట్రంలోని కోటి 13 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేత

-సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఉచితంగా హెచ్ పి వి వ్యాక్సిన్లు
-నులిపురుగుల నివారణ దినం సందర్భంగా  వడిసలేరు గ్రామంలో  విద్యార్థులకు ఔషధాల అందజేత
-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా మంగళవారం రంగంపేట మండలం వడిసెలేరు లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. నులిపురుగుల నివారణ దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 11 ,12 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి 13 లక్షల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించామని చెప్పారు. వీరిలో ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు గల 24 లక్షల మంది చిన్నారులకు అంగన్వాడీలలో, ఐదు నుంచి 19 సంవత్సరాలు గల 84 లక్షల మందికి పాఠశాలలు,జూనియర్ కళాశాలలు, ఐటిఐ లలో అందించినట్లు చెప్పారు.

నులి పురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయని చెప్పారు. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చెప్పారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. దేశంలో నమోదవుతున్న 1600 ల క్యాన్సర్ కేసుల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 200 దాకా ఉండడం ఆందోళన  కలిగించే అంశం అని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 9 నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలకు 10,000 రూపాయలు విలువచేసే హెచ్ పి వి వ్యాక్సిన్ను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు, డి ఎం హెచ్ ఓ కె.వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *