Breaking News

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తిచేయాలి

-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు రహదారులు, డ్రెయిన్ల నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. శ్రామిక భవన్, ఆర్టీవో ఆఫీస్ వద్ద సీసీ డ్రెయిన్, కంటిపూడి రామారావు స్కూల్ సీసీ రోడ్డు, NRCP రోడ్డు జంక్షన్ వద్ద సీసీ డ్రెయిన్, పూలే భవన్, IMA హాల్ తో పాటు ఎల్బీ శాస్త్రి రోడ్డులో బీటీ రోడ్డు పనులను పర్యవేక్షించి.. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదన్నారు. కేటాయించిన నిధులు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. చేపట్టిన ప్రతి పనిలో నాణ్యతలో ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడరాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎస్ఈ(ఇంజనీరింగ్) ఎం.సీహెచ్.కోటేశ్వరరావు, ఈఈ మదర్సా అలీ, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *