Breaking News

రాజానగరంలో ‘నక్షయ మిత్రా’ కిట్ల పంపిణీ – అవగాహన కార్యక్రమం

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారంరాజానగరంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా టి.బి బాధితులకు ‘నక్షయ మిత్రా’ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో పౌష్టికాహారం, అవసరమైన ఔషధాలు, రోజువారీ వినియోగ వస్తువులు ఉండగా, రోగులు త్వరగా కోలుకోవడానికి మద్దతు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, టి.బి నిర్మూలనలో సామాజిక భాగస్వామ్యం కీలకమని, ‘నక్షయ మిత్రా’గా నమోదు అయి ఆర్థిక సహాయం అందించడంలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పోషకాహారం, సమయానికి చికిత్స, మానసిక ధైర్యం ద్వారా టి.బి రహిత సమాజం సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *