Breaking News

‘ఉల్లాస్ – అక్షర ఆంధ్ర’ వయోజన అక్షరాస్యతా కార్యక్రమంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళ వారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్, రాజమహేంద్రవరం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, డీఆర్‌డీఏ పీడీ మూర్తి, డ్వామా పీడీ నాగమహేశ్వరరావు, మెప్మా పీడీ వెంకటరామణ, సీపీవో ఎల్ . అప్పలకొండ, వయోజన విద్య డీడీ పి. పొసయ్య, వయోజన విద్య నోడ్‌ల్ అధికారి అనిసెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, .డీఆర్‌డీఏ, మెప్మాలో ఉన్న స్వయం సహాయక బృందాల మహిళలు, ఉపాధి హామీ (NREGA) కూలీలలో చదువురాని వారిని గుర్తించి, వారికి చదువు చెప్పడానికి ప్రతి పది మందికి ఒక వాలంటీర్ టీచర్‌ను ఎంపిక చేసి, ఆ వివరాలను అందజేయాలని సూచించారు. గుర్తించబడిన టీచర్లకు మండల స్థాయిలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ శిక్షణ అనంతరం టీచర్లు తమ పరిధిలోని అభ్యాసకులకు క్రియాత్మక, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను విజయ వంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీఓలు, ఎంపీడీవోలు, డివై ఎంపీడీవోలు, ఎంఈఓలు, డీఆర్‌డీఏ ఏపీఎంలు, మెప్మా సీఎంఎంలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *