Breaking News

తోకాడ గ్రామంలో రీ-సర్వే ఫైనల్ ROR గ్రామ సభ

-భూవివాదాల నివారణకు రీ-సర్వే కీలకం
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా 02.08.2025న జారీ చేసిన 13వ నోటిఫికేషన్ ప్రకారం రాజానగరం మండలంలోని తోకాడ గ్రామంలో ఫైనల్ ROR గ్రామ సభకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రీ-సర్వే ప్రక్రియ భూహక్కులు స్పష్టతకు రావడం, భూవివాదాలు తగ్గడం, రికార్డుల ఖచ్చితత్వానికి దోహదం చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతానికి గ్రామ ప్రజలు, అధికారులు సమన్వయం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. సాంకేతిక పద్ధతులతో ఖచ్చితమైన భూ రికార్డులు సేకరించామని, ఇవి భవిష్యత్తులో భూ సమస్యల పరిష్కారానికి ఉపయోగ పడతాయని తెలిపారు. రీ సర్వే ప్రక్రియ నేపథ్యం కు సంబంధించిగ్రామ సభలో వివరాలు తెలియ చేయడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. వాటి పై వొచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 658 సర్వే నంబర్లకు 3410 LPM DLR పబ్లికేషన్ చేయగా, గ్రామ విస్తీర్ణం 4674.19 ఎకరాలు ఉండగా, రీ-సర్వే అనంతరం 4654.969 ఎకరాలు నిర్ధారించబడ్డాయి.ప్రభుత్వ భూమి సర్వే నంబర్లు 247 (341.65 ఎకరాలు) ఉండగా, రీ-సర్వే అనంతరం 341.052 ఎకరాలు ఖరారయ్యాయి. ప్రైవేట్ భూమి సర్వే నంబర్లు 415 (4332.54 ఎకరాలు) ఉండగా, రీ-సర్వే అనంతరం 4313.91 ఎకరాలు నమోదయ్యాయి. మొత్తం ఖాతాలు 1938 నుండి 1924కు తగ్గాయనీ వెల్లడించారు.

ఈ గ్రామ సభలో సర్వే అధికారి మోహన్ రావు, తహసిల్దార్ జి.ఎల్.వి. దేవి, రెవెన్యూ, సర్వే, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *