Breaking News

నన్నయ యూనివర్సిటీ లో స్ఫూర్తిదాయకంగా యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం

-ర్యాగింగ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది… ర్యాగింగ్ పాల్పడవద్దు
-కలెక్టర్ పి ప్రశాంతి
-సీనియర్లు రోల్ మోడల్స్ గా ఉండాలి
-వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
తన జీవితంలో కూడా ర్యాగింగ్ కు భయపడిన సంఘటనలు ఉన్నాయని, ర్యాగింగ్ విద్యార్థుల్లోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఎవ్వరూ ర్యాగింగ్ కు పాల్పడవద్దని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో యాంటీ ర్యాగింగ్ వీక్ మూడవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ హాజరై నన్నయ విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఏ విద్యాలయాల్లో ర్యాగింగ్ లేకుండా ఉంటుందో అటువంటి విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారని, విద్యార్థులు కూడా ర్యాగింగ్ లేని విద్యాసంస్థల్లో చదవడానికి సుముఖత చూపిస్తారని అన్నారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ కు భయపడి విద్యకు దూరమైన విద్యార్థులు అనేక మంది ఉన్నారని, విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోవద్దని ఆనందంగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయాల్లో అధ్యాపకుల సమక్షంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో బయటకు వెళ్ళిన తరువాత అదే ప్రవర్తనను కలిగి ఉండాలన్నారు. విశ్వవిద్యాలయాల గౌరవం, పేరు ప్రఖ్యాతలు విద్యార్థుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, జూనియర్ విద్యార్థులకు మార్గనిర్దేశకులుగా సీనియర్లు వ్యవహరించాలని తెలియజేశారు. తాను విద్యాభ్యస సమయంలో ర్యాగింగ్ కు భయపడి సెలవు పెట్టిన సందర్భాలు ఉన్నాయని, అటువంటి పరిస్థితులు ఏ విద్యార్థికి రాకూడదని స్పష్టం చేశారు.

వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ప్రముఖ వ్యక్తులను విశ్వ విద్యాలయానికి తీసుకురావడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తి కలుగుతుందని, ర్యాగింగ్ వ్యతిరేక వారంలో భాగంగా మూడవ రోజు కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతికి అభినందనలు తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యా నైపుణ్యం పట్ల మాత్రమే కాకుండా, గౌరవం, దయ, కరుణతో మెలిగే సంస్కృతి క్యాంపస్ ల ఉండడం ఆనందంగా ఉందన్నారు. ర్యాగింగ్ ఒక వ్యక్తి మనస్సును మచ్చగా మార్చుతుందని, వారి కలలను పూర్తిగా నాశనం చేసే హానికరమైన చర్య అని అభివర్ణించారు. విశ్వవిద్యాలయం యొక్క నిజమైన గుర్తింపు దాని భవనాలలో కాదని, దాని సభ్యులు పంచుకునే సంబంధాలలో ప్రతిబింబమవుతుందని చెప్పారు. ఈ ర్యాగింగ్ వ్యతిరేక వారంలో ప్రతి సీనియర్ విద్యార్థి తమను తాము మార్గదర్శకులుగా మరియు రోల్ మోడల్స్‌గా చూడాలని కోరుకుంటున్నాని అన్నారు. నేరస్థులను శిక్షించడానికి మాత్రమే కాకుండా, ప్రతి విద్యార్థికి ఇది సురక్షితమైన స్థలం అని భరోసా ఇవ్వడానికి మేము ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు, హెల్ప్‌లైన్‌లు మరియు కఠినమైన క్రమశిక్షణా యంత్రాంగాలను ఏర్పాటు చేసామని తెలియజేశారు. ఫ్రెషర్‌కు స్నేహం, సామరస్యం, అభ్యాసం మాత్రమే దీక్షగా ఉండాలని అన్నారు. భయానికి క్యాంపస్ లో స్థానం లేదని, ఆకాంక్ష, గౌరవం మాత్రమే ఉండేలా చూసుకుందాని పిలుపునిచ్చారు.

తరువాత కలెక్టర్ పి ప్రశాంతి ని వీసీ ప్రసన్నశ్రీ సన్మానించి నన్నయ జ్ఞాపికను అందజేసి అభినందించారు. విద్యార్థులతో కలెక్టర్ మమేకమైన వారితో మాట్లాడారు. విద్యార్థులు కలెక్టర్ ప్రశాంతి, వీసీ ప్రసన్నశ్రీ లతో సెల్ఫీలు దిగారు. అనంతరం శక్తి యాప్, సైబర్ నేరాలపై రాజానగరం ఎసై పి నారాయణమ్మ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి, స్టూడెంట్ ఆఫైర్స్ డీన్ ఆచార్య ఎన్. ఉదయ్ భాస్కర్ మరియు విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *