Breaking News

భావితరాలకు స్ఫూర్తి..అణగారిన వర్గాల ఆశాజ్యోతి కీ.శే. సర్దార్ గౌతు లచ్చన్న

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-రాజమహేంద్రవరం వై జంక్షన్ లో ఘనంగా ప్రజా బాంధవుడు గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు
-గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న జయంతి వేడుకలను జీవో నెం.83 ద్వారా అధికారికంగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారాలోకేష్ కు ధన్యవాదాలు మంత్రి దుర్గేష్ తెలిపారు. లచ్చన్న ఆశయాల సాధనకు కృషి చేస్తున్న గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘాలను మంత్రి దుర్గేష్ అభినందించారు.

రాజమహేంద్రవరం: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి, తను నమ్మిన సిద్దాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా బడుగు, బలహీన వర్గాలకు దిక్సూచిగా నిలిచిన సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రను భావి తరాలకు తెలపాల్సిన అవసరముందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్వాతంత్ర్య సమరం, రాజకీయ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన కీ.శే. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శనివారం రాజమహేంద్రవరం వై జంక్షన్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు.తెలుగు జాతికి గర్వకారణమైన సర్దార్ గౌతు లచ్చన్న లాంటి గొప్ప వ్యక్తి జయంతిని ఏటా అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన సర్దార్‌ గౌతు లచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.గౌతు లచ్చన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న రాజమండ్రి గౌడ, శెట్టి బలిజ సంఘానికి అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్యం ముందు, తర్వాత ప్రజలను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్న జయంతిని జీవో నంబర్ 83 ద్వారా అధికారికంగా, రాష్ట్ర పండుగగా నిర్వహించుకునే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

గౌతు లచ్చన్న పేరు వింటేనే ఉద్యమానికి నిలువెత్తు రూపంగా నిలుస్తారని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. భారతదేశ రాజకీయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు పొందిన మహనీయులు గౌతు లచ్చన్న అని గుర్తుచేశారు.సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నెగ్గారని, మంత్రిగా కూడా చేశారని వివరించారు. ప్రజల తరపున పోరాడిన ఘటనలు కోకొల్లలు అని వెల్లడించారు. కల్లుగీత కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకు కృషి చేశారని పేర్కొన్నారు. 96 సంవత్సరాల తన జీవిత కాలంలో రాష్ట్ర ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశారని నాడు పలాసలో ఒక్కడే అఖిల భారత కిసాన్ సభను నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. మెట్రిక్యులేషన్ చదువుతున్న సమయంలో మహాత్మా గాంధీజీ పిలుపుమేరకు ఉద్యమంలోకి అడుగుపెట్టారని, అనేక పర్యాయాలు ప్రజల కోసం జైలుకు వెళ్లారని, అలాంటి ఎందరో గొప్ప వ్యక్తుల త్యాగనిరతి వల్లే నేడు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.

గౌతు లచ్చన్నను సముచితంగా గౌరవించుకునేలా సీఎం చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో జయంతి వేడుకలు మరింత అద్భుతంగా నిర్వహించుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. దేశ, రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకుడైన లచ్చన్న లాంటి నాయకుడి గొప్పతనాన్ని తెలియజేసే అవకాశాన్ని పొందుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా జోహార్ గౌతు లచ్చన్న అని మంత్రి కందుల దుర్గేష్ నినదించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *