Breaking News

మంత్రి నారా లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం / కోరుకొండ,  నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో మంత్రి డా. నిమ్మల రామా నాయుడు ఇంట జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఆర్ టీ జి శాఖల మంత్రి నారా లోకేష్ తిరుగు ప్రయాణం లో ఆదివారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి. నరసింహ కిషోర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ను విమానాశ్రయం లాంజ్ లో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. కలెక్టర్ వెంట ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ , డీఎస్పీ కే.రమేష్ బాబు, తదితర అధికారులు పాల్గొన్నారు. తదుపరి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ , అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లు విమాన మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్లడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *