Breaking News

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో యువతకు కొత్త అవకాశాల ద్వారం

-రాజమహేంద్రవరం స్పోక్ కేంద్ర ప్రారంభంలో నేతలతోపాటు విద్యా – పరిశ్రమల ప్రతినిధుల భాగస్వామ్యం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబునాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, గోదావరి జిల్లాలు వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ లు పేర్కొన్నారు. సాంకేతికత–యువత కలయికతో చిన్న ఆవిష్కరణలు కూడా పెద్ద పరిశ్రమలుగా ఎదగగలవని, రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం లేదా వ్యాపారం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

బుధవారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్  కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, కలెక్టర్ పి ప్రశాంతి లు ప్రారంభించారు.

సీఎం చంద్రబాబునాయుడు మానస పుత్రిక రతన్ ఇన్నోవేషన్ హబ్” – మంత్రి నిమ్మల రామానాయుడు

తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాజమహేంద్రవరం లోని బొమ్మూరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మానస పుత్రికగా ఈ హబ్ ను అభివర్ణించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఐదు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ హబ్ లతో యువతలోని నైపుణ్యాలను వెలికితీసి, కొత్త ఆవిష్కరణల ద్వారా నిరుద్యోగ నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. వ్యవసాయంలో ముందున్న గోదావరి జిల్లాలు, పారిశ్రామిక రంగంలో కూడా ముందువరుసలో నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తూ, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

గత పాలనలో పరిశ్రమలు వెనక్కి తగ్గితే, చంద్రబాబు – లోకేష్ వాటిని తిరిగి రప్పిస్తున్నారని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం పరిశ్రమల సహకారంతో ప్రత్యేక శిక్షణ అందిస్తుందని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గోదావరి జిల్లాలకు పారిశ్రామిక బాటలు వేసిందని నిమ్మల రామానాయుడు అన్నారు.

“సాంకేతికత – యువత కలయికతో కొత్త యుగం” – మంత్రి కందుల దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలోని ప్రతిభకు సాంకేతిక సహకారం లభిస్తుందని అన్నారు. చిన్న స్థాయి ఆవిష్కరణలు కూడా పెద్ద స్థాయి పరిశ్రమలుగా ఎదగడానికి ఈ కేంద్రం పునాది వేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలు సృష్టించడం, పరిశ్రమలతో కలసి శిక్షణ – ప్రోత్సాహం అందించడం ద్వారా గోదావరి జిల్లాలు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాయని కందుల దుర్గేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

“రాబోయే తరానికి దిక్సూచి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్” – ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

సభాధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, బొమ్మూరు పాలిటెక్నిక్ చరిత్రలో ఇది కొత్త మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. నూతన ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు ఇస్తూ ఇది యువతకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా మారుతుందని తెలిపారు.

“కొత్త ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ముందుకు” – అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు

అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంతోనే ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి నిలిచిపోయిందని, ఇప్పుడు కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.

“రాష్ట్రాభివృద్ధే ప్రధాన లక్ష్యం” – ఎమ్మెల్సీ సోమువీర్రాజు

ఎంఎల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ, వికసిత్ భారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నదే కేంద్రం ఆలోచన అని అన్నారు. ఇప్పటికే క్వాంటమ్ సెంటర్‌కు రూ.1000 కోట్ల మంజూరు చేయడానికి కేంద్రం సుముఖత తెలిపిందని, ఏపీ తలపెట్టిన ప్రతి ఆవిష్కరణాత్మక కార్యక్రమానికి ప్రధాని మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మ శ్రీ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, గ్రీన్ కోర్ చైర్మన్ జీ. రాంబాబు, నన్నయ యూనివర్సిటీ వీసీ వి. ప్రసన్న,  గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఛాన్సలర్ కే వి వి సత్యనారాయణ రాజు  (చైతన్యరాజు) , ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ శేషారెడ్డి, గెయిల్ ప్రతినిధి కేవీఆర్ రావు, ఓఎన్జిసి ప్రతినిధి కే వి కే రాజు ,  తాడేపల్లిగూడెం ఎన్ఐటి ప్రతినిధి రవికిరణ్ శాస్త్రి, వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రతినిధి శ్రీరామ్, జిల్లా పరిశ్రమ అధికారి వనిధర్ రామన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *