– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
– రూ. 65 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగం పంతులు వారి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్‌కెవీటీ డిగ్రీ కళాశాల ఆవరణలోని మేజర్ డ్రైనేజీపై ఐరన్ షట్టర్లు ఏర్పాటు చేసే నిమిత్తం రూ. 65 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్‌కెవీటీ కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజీ కారణంగా దానికి ఆనుకుని ఉన్న నివాసాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా దాని నుంచి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ డ్రైనేజీపై ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ పనులు చేయడం జరిగిందని, దుర్వాసన రాకుండా పూర్తిగా కప్పబడే విధంగా జి ఐ షీట్ ఏర్పాటు చేసేందుకు రూ. 65 లక్షలతో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. జీ ఐ షీట్ అనేది శాశ్వత పరిష్కారం కాదని, సిల్టు తీసుకునే విధంగా పూర్తిగా కాంక్రీట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాల సమయానికి శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. నగరంలో ఎక్కడికక్కడ ప్రజలకు అవసరమైన పనులు చేయడం జరుగుతోందన్నారు. నగరంలో నిత్యం శానిటేషన్ నిర్వహణ చేపట్టేలా… అలాగే డ్రైనేజీల్లో ఎప్పటికప్పుడు సిల్టు తీసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కేవలం ప్రజలకు ఉపయోగపడే పనులపైనే తమ కూటమి ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన వెంటనే నగరంలోని రోడ్లపై ప్రతి చిన్న గుంతను పూడ్చే కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News