– రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్, కడియం మండలం కడియం గ్రామంలో నాబార్డ్ నిధులతో రూ.2 కోట్లు 60 లక్షల వ్యయంతో కడియం నుండి జేగురుపాడు వరకు నిర్మించబడనున్న కొత్త కెనాల్ రోడ్ నిర్మాణ పనుల శిలాఫలకాన్ని సోమవారం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ – కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ పథకాలు పట్ల ప్రభుత్వ అంకితభావాన్ని కలిగి ఉందన్నారు. ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం ను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా మారేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ రహదారి సదుపాయాల విస్తరణ, విద్యుత్ సరఫరా మెరుగుదల, మహిళా శ్రేయస్సు, విద్యారంగం అభివృద్ధి, వ్యవసాయానికి తగిన మద్దతు వంటి అనేక రంగాలలో కూటమి ప్రభుత్వం విస్తృతంగా కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News