వరదలపై శాఖలందరూ సమన్వయంతో చర్యలు చేపట్టాలి

-ఘాట్ల వద్ద బ్యారికెంటింగ్ ఏర్పాటు చేసి 24×7 పర్యవేక్షణ వ్యవస్థ
-అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు
-జేసీ మేఘ స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ధవళేశ్వరం ప్రాంతంలో వరదల దృష్ట్యా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రెవెన్యూ శాఖ బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలనీ, పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ, గస్తీ పెంపు చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ ఆనకట్టలు పర్యవేక్షించి నీటి మట్టం వివరాలు అందించాలన్నారు. పోలీసు రెవెన్యూ, ఆర్ ఎమ్ సి అధికారులతో ఘాట్ల వద్ద బ్యారికెంటింగ్ ఏర్పాటు చేసి 24×7 పర్యవేక్షణ వ్యవస్థ సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు చెత్త తొలగింపు, తాగునీటి క్లోరినేషన్ చేపట్టాలనీ స్పష్టం చేశారు. ఫైర్ సర్వీసెస్ రెస్క్యూ పరికరాలు సిద్ధంగా ఉంచి అత్యవసర కాల్స్‌కి వెంటనే స్పందించాలన్నారు. ఫిషరీస్ శాఖ జాలర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించి పడవల భద్రతను నిశితంగా గమనించాలన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నది లోకి వెళ్ళే వారి విషయంపై దృష్టి సారించాలి అని కోరారు. విద్యా శాఖ పాఠశాలలను శిబిరాలుగా వినియోగించి విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలి. వైద్య శాఖ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి దోమల నివారణ చర్యలు చేపట్టాలి. విద్యుత్ శాఖ ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా నిలిపి వేయాలి, రవాణా శాఖ రహదారులు, వంతెనలను పర్యవేక్షించాలి. పౌర సరఫరాలు, సంక్షేమ, వ్యవసాయ, పరిశ్రమలు తదితర శాఖలు తమ పరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ క్రమంలో ఆలస్యం చేయరాదు, నిర్లక్ష్యం చేయరాదు, ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనేలా వదిలేయరాదనీ జేసి స్పష్టం చేశారు. ముఖ్యంగా వరద హెచ్చరికలు ఆలస్యం చేయకుండా అందించాలి, శానిటేషన్ లోపాలు వదిలేయరాదు, తడి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇవ్వరాదు, ధ్వంసమైన రోడ్లపై వాహన రాకపోకలు అనుమతించరాదు, కలుషిత నీరు అందించరాదు, సహాయ సామగ్రి పంపిణీలో అసమానతలు ఉండరాదు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తేనే బాధితులకు సమయానికి సాయం చేరుతుందని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ స్పష్టం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన నంబర్లు: కలెక్టరేట్ కంట్రోల్ రూమ్, బొమ్మూరు – 89779 35611, ఆర్డీవో కార్యాలయం, రాజమహేంద్రవరం – 0883-2442344, ఆర్డీవో కార్యాలయం, కోవ్వూరు – 79953 67797. కామన్ టోల్ ఫ్రీ నంబర్లు: 1070, 112, 1800-425-0101, 8333905022.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *