Breaking News

పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో కృష్ణ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గల ఆల్‌కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వరద సహాయక పునరావాస కేంద్రాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ సోమవారం ఉదయం తనిఖీ చేశారు. మెడికల్ క్యాంప్, భోజన, ఇతర వసతులను పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఈ పునరావాస కేంద్రంలో బ్రిడ్జి లంక నుండి 123 మంది, కేతావారీ లంక నుండి 75 మంది, వెదురమ్మలంక నుండి 76 మంది – మొత్తం 98 కుటుంబాల 274 మంది నివాసం పొందుతున్నారనీ ఆర్డీవో కృష్ణ నాయక్ తెలిపారు. ఆర్‌డీవో పునరావాసం పొందుతున్న కుటుంబాలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. భోజన మరియు వైద్య సదుపాయాలు సరైన సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరద సంబంధిత అధికారుల సూచనలు పూర్తిగా పాటించాలని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *