Breaking News

“స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో 3, జిల్లా స్థాయిలో 51 అవార్డులు”

-అక్టోబర్ 6 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆనం కళాకేంద్రం లో జిల్లా స్థాయి అవార్డ్ ప్రధాన కార్యక్రమం
-జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమం కింద తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయనీ జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వివిధ విభాగాల్లో ప్రతిపాదనలు నోడల్ అధికారిగా జిల్లా నుంచి ఆయా కేటగిరీలలో 15 విభాగాలలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పల కొండ వ్యవహరించడం జరిగింది

రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం విజయవాడ లోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డ్ ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవం అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ తెలిపారు.

రాష్ట్ర స్థాయి అవార్డులు

1. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు – రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్

2. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీ – రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్

3. స్వచ్ఛ బస్ స్టేషన్ కేటగిరీ – కొవ్వూరు బస్ స్టేషన్

జిల్లా స్థాయి అవార్డులు (51)

I. ఉత్తమ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్లు

1. వెంకటనగరం, రాజమహేంద్రవరం రూరల్

2. బొంగరాల దుర్గాప్రసాద్ – వెలిమిన్ను, ఉండ్రాజవరం మండలం

3. పాల రామారావు – నందమూరు, కొవ్వూరు మండలం

4. ఉన్నమట్ల నాగరాజు – గంటవారిగూడెం, నల్లజర్ల మండలం

5. బత్తిన రాజు – కుతుకులూరు, అనపర్తి మండలం

 

II. ఉత్తమ స్వచ్ఛత ఎన్జీఓలు

6. స్వర్ణ ఆంధ్ర ఫౌండేషన్ – రాజమహేంద్రవరం

7. శ్రీరామకృష్ణ సేవా సమితి – అనపర్తి

8. బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం – రాజమహేంద్రవరం

III. ఉత్తమ స్వచ్ఛత యోధులు

9. ఇంటి పార్వతి – రాజమహేంద్రవరం కార్పొరేషన్

10. ముత్యాల పాండురంగ – రాజమహేంద్రవరం కార్పొరేషన్

11. బంగారు సూరిబాబు – నిడదవోలు పురపాలక సంఘం

12. కృష్ణవేణి మామిడిపల్లి – నిడదవోలు మునిసిపాలిటీ

13. మీసాల శ్యాంబాబు – కొవ్వూరు మునిసిపాలిటీ

IV. స్వచ్ఛ అంగన్‌వాడీలు

14. చౌడేశ్వర్ నగర్ అంగన్‌వాడీ – రాజమహేంద్రవరం

15. కొరుకొండ అంగన్‌వాడీ – కొరుకొండ మండలం

16. ముక్కామల అంగన్‌వాడీ – పెరవలి మండలం

17. రాజీవ్ కాలనీ అంగన్‌వాడీ – కొవ్వూరు

18. తాడిమళ్ళ అంగన్‌వాడీ – నిడదవోలు

V. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు

19. సబ్ కలెక్టర్ కార్యాలయం – రాజమహేంద్రవరం

20. నీటిపారుదల శాఖ కార్యాలయం – ధవళేశ్వరం

VI. స్వచ్ఛ గ్రామ పంచాయతీలు

21. చాగల్లు గ్రామపంచాయతి – చాగల్లు మండల

22. గంటవారిగూడెం గ్రామపంచాయతి – నల్లజర్ల మండలం

23. ఇసుకపట్ల పంగిడి గ్రామపంచాయతి – కొవ్వూరు మండలం

24. కాతేరు గ్రామపంచాయతి – రాజమహేంద్రవరం రూరల్ మండలం

25. కుతుకులూరు గ్రామపంచాయతి – అనపర్తి మండలం

VII. స్వచ్ఛ ఆసుపత్రులు

26. పిహెచ్‌సి చాగల్లు కలవలపల్లి – చాగల్లు మండలం

27. జిహెచ్‌డీ ఖండవల్లి – చాగల్లు మండలం

28. పట్టణ ఆరోగ్య కేంద్రం, మెరక వీధి – రాజమహేంద్రవరం

VIII. స్వచ్ఛ వసతిగృహాలు

29. సామాజిక సంక్షేమ బాలికల వసతిగృహం – సమీశ్రగూడెం, నిడదవోలు మండలం

30. ప్రభుత్వ బిసి సంక్షేమ కాలేజీ వసతిగృహం – రాజమహేంద్రవరం

31. జిఏహెచ్‌ఎస్ బాలికల వసతిగృహం – బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్

IX. స్వచ్ఛ పరిశ్రమలు

32. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – బలభద్రపురం

33. అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ – గుమ్మలదొడ్డి, గోకవరం మండలం

34. తేజాస్ స్టీల్ ఇండస్ట్రీస్ – రాజమహేంద్రవరం రూరల్

35. హౌస్ ఆఫ్ ట్రైబ్ ప్రైవేట్ లిమిటెడ్ – ధవళేశ్వరం

X. స్వచ్ఛ పురపాలక సంఘం

36. నిడదవోలు మునిసిపాలిటీ – నిడదవోలు

XI. స్వచ్ఛ నివాస వసతిగృహం

37. ఏ.పి.ఎస్.డబ్ల్యు. ఆర్.ఎస్. – ధవళేశ్వరం

XII. స్వచ్ఛ రైతుబజార్

38. రైతు బజార్ – క్వారీ, రాజమహేంద్రవరం రూరల్

XIII. స్వచ్ఛ పాఠశాలలు

39. పీఎంస్రీ జెడ్‌పిహెచ్‌ఎస్ – రఘుదేవపురం

40. జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ – నిడదవోలు

41. ఎస్.ఆర్. జెడ్‌పిహెచ్‌ఎస్ ప్లస్ బాలుర – అనపర్తి

42. జెడ్‌పిహెచ్‌ఎస్ శాటిలైట్ సిటీ – రాజమహేంద్రవరం రూరల్

43. మండల ప్రజాపరిషత్ పాఠశాల నెం.1 – కుమారదేవరం, కొవ్వూరు మండలం

XIV. స్వచ్ఛ స్వయం సహాయక సంఘాలు

44. సీతంపేట మహిళా సంఘం – కృష్ణానగర్, రాజమహేంద్రవరం

45. రాజీవ్ కాలనీ మహిళా సంఘం – కొవ్వూరు

46. శ్రీనివాసపురం మహిళా సంఘం – కొవ్వూరు (వంబే కాలనీ)

XV. స్వచ్ఛ గ్రామసంఘాలు

47. చంద్రేడు గ్రామసంఘం – రంగంపేట

48. కానూరు గ్రామసంఘం – పెరవలి మండలం

49. కరిచర్లగూడెం గ్రామసంఘం – గోపాలపురం మండలం

50. వెలుగుబంద గ్రామసంఘం – రాజానగరం మండలం

51. వేములూరు గ్రామసంఘం – కొవ్వూరు మండలం

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *