Breaking News

దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు

-ఈ దశలో ఐదు మరో గ్రామాల్లో జిల్లాలో రీ సర్వే ప్రారంభం
-నర్సింహాపురం అగ్రహారం నేడే గ్రామ సభ
-నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు, అందులో భాగంగా అక్టోబర్ 3 వ తేదీ నుంచి మరో ఐదు గ్రామాల్లో రీ సర్వే పనులు ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. అందులో భాగంగా సోమవారం కోరుకొండ మండలం నర్సింహాపురం అగ్రహారం గ్రామంలో రీ సర్వే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గతంలో 190 గ్రామాల్లో రీ–సర్వే పూర్తయిందని, వాటిపై వస్తున్న అర్జీలను ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలనా చేయడం ద్వారా పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తదుపరి 16 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చెయ్యగా, మరో 15 గ్రామాల్లో రీ సర్వే పనులు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 3 (శుక్రవారం) నుండి మరో 5 గ్రామాల్లో రీ–సర్వే పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ఈ రీ–సర్వే ప్రక్రియకు జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.

రీ సర్వే గ్రామాల మండలం/ గ్రామాల జాబితా:
చాగల్లు మండలం : ఎస్.ముప్పవరం, దారవరం,
తాళ్లపూడి మండలం : తాళ్లపూడి, కుక్కునూరు,
కోరుకొండ మండలం : నర్సింహాపురం అగ్రహారం

రీ–సర్వే ప్రధాన ఉద్దేశ్యం భూయజమానుల యాజమాన్య హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూవివాదాలను నివారించడం అన్నారు. రీ సర్వే చేసిన తర్వాత ప్రతి రైతు–భూస్వామికి డిజిటల్ ఆధారాలతో కూడిన శాశ్వత రికార్డులు కల్పించడం ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ పేర్కొనడం జరిగింది. భూ యజమానులు, గ్రామస్థులు రీ–సర్వే సమయంలో రెవెన్యూ, సర్వే అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *