– ఆయన జీవితం విద్యా ప్రచారం, మరియు మానవతా విలువలకు అంకితం
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత మతపండితుడు, జమియత్ ఉలేమా-ఎ-హింద్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ ఇక లేరని తెలిసి హృదయం కలిచివేసిందని అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మరణం మతపరమైన, సామాజిక, విద్యా రంగాలకు తీరని లోటని అన్నారు. ఆయన జీవితం అంతా మత సేవ, విద్యా ప్రాచుర్యం, మరియు మానవతా విలువల ప్రోత్సాహానికి అంకితం అయిందని అన్నారు. శాంతి, సహనం, ఐక్యత వంటి విలువలను సమాజంలో వ్యాప్తి చేసిన గౌరవనీయ వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. ముస్లిం సమాజం కోసం నిస్వార్ధంగా పనిచేసిన గొప్ప నాయకుడని అన్నారు. మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని, ఆయన సౌమ్యత, వినయం, మరియు సమాజం పట్ల ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. అల్లాహ్ తాలా ఆయన ఆత్మకు జన్నత్ అల్ ఫిర్దౌస్ లో ఉన్నత స్థానం ప్రసాదించాలని, ఆయన కుటుంబ సభ్యులకు, శిష్యులకు, అభిమానులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ఓర్పు ప్రసాదించమని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.
Prajavartha Online Telugu News