Breaking News

భారీ వర్షాలను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి
-కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమరావతి నుంచి హోమ్ మంత్రి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుండి ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య డిఆర్ఓ నరసింహులు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమీషనర్ హోం మంత్రికి వివరిస్తూ.. ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలన జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి సూళ్లూరుపేట లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదయిందని, తడ, వాకాడు, కోట తీర ప్రాంతంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకోవడం పాటు పునరావాస హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో భారీ వర్షం నేపథ్యంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు రేణిగుంట లో ఎక్కువ వర్షపాతం వలన అక్కడ కొన్ని కాలనీలోనీ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని అన్నారు. ఎక్కడ వర్షపు నీరు నిల్వ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీరు కలుషితం లేకుండా ఎప్పటికప్పుడు వాటర్ టెస్టింగ్ కూడా జరుపుతున్నామని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ.. భారీ వర్షం కారణంగా జిల్లాల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని తెలిపారు. ఎలాంటి విద్యుత్తు అంతరాయం లేకుండా సంబంధిత శాఖ వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పీహెచ్సీ సెంటర్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, మెడికల్ క్యాంపులు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అన్ని శాఖాధికారులు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.. జిల్లాలోని డ్యాములు నీటి నిల్వ స్థాయిని తెలుసుకుంటూ ఇరిగేషన్ శాఖ వారు పర్యవేక్షించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను పరిశీలించి ఎప్పటికప్పుడు వర్షపాత నమోదు వివరాలను, రిపోర్టులను తెలియజేసేలా ఉండాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *