Breaking News

నకిలీ ACB అధికారుల మోసపూరిత ఫోన్ కాల్స్‌పై హెచ్చరిక

– డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ACB) ఎమ్. కిషోర్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవలి కాలంలో కొంతమంది నకిలీ వ్యక్తులు తాము ACB అధికారులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను మోసగించే ఘటనలు జరుగుతున్నాయని, వారు ACB అధికారుల పేర్లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడు తున్నారని అవినీతి నిరోధక శాఖ (ACB) రాజమహేంద్రవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎమ్. కిషోర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆదివారం (19-10-2025) కాకినాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, “మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దాడులు జరగకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి” అనే ధోరణిలో మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. గతంలో కూడా జిల్లాలోని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి బెదిరింపు కాల్స్‌కు గురైనట్లు గుర్తించామని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ACB స్పష్టీకరణ
ACB అధికారులు ఎప్పటికీ ఫోన్ ద్వారా డబ్బులు లేదా ఇతర ప్రయోజనాలు అడగరని, ACB పేరుతో డబ్బులు అడిగేవారు పూర్తిగా మోసగాళ్లు అని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదని, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ACB అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విజ్ఞప్తి
ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, నకిలీ వ్యక్తుల మాటలకు మోసపోవద్దని, ACB పేరుతో మోసం చేయడం ఒక తీవ్రమైన నేరమని తెలిపారు. ఇలాంటి మోసగాళ్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్. కిషోర్ కుమార్ స్పష్టం చేశారు.

సెల్..9440446160 లేదా కార్యాలయ ల్యాండ్ లైన్ 0883 – 2467833 నెంబర్ కు నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *