– మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ. కనకరాజు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అమృత గోదావరి మరియు రాజమహేంద్రి TLFలలో వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపార ఏర్పాట్లు మరియు SHG సభ్యుల సౌకర్యాలను పెంపొందించేందుకు స్థానిక మెప్మా కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ. కనకరాజు LHP సెల్ ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మరింత అభివృద్ధి పరచడానికి, SHG, ముద్ర, SEP, PMEGEP, PMFME పథకాల ద్వారా లోన్స్ అందించే అవకాశాలను ఎస్ హెచ్ జీ మహిళలకు అందించే క్రమంలో ప్రణాళికలు అమలు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజ్‌లను పొందేలా, సంఘాల అభివృద్ధి కోసం చేపట్ట వలసిన వాటిపై ప్రత్యేక సూచనలు ఇచ్చారు. అలాగే, D.G. లక్ష్మీ నాయకత్వంలో సమాఖ్య వారీగా సెలెక్ట్ చేసిన సభ్యుల ద్వారా kiosk సెంటర్‌లను ఏర్పాటు చేసి 156 సేవలను ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక రాజు తెలిపారు.
బ్యాంక్ లింకేజ్ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించడం కుండా దుర్వినియోగం చేసిన వాటిపై విచారణ చేపట్టాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రతి 3వ శుక్రవారం SHG సభ్యుల కోసం ప్రత్యేక పరిష్కార వేదిక (Grievance Forum) ఏర్పాటు చేస్తామని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు.
ఈ సమావేశానికి ఐ.బి. ఎమ్. ఫణీకుమార్, CMM వి. రామలక్ష్మి, TMC G.V.S. సాయికుమార్ నేతృత్వంలో నిర్వహించగా Co, RP లు పాల్గొన్నారు:
Prajavartha Online Telugu News